Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుండ్ర సుమన్ కు "దళిత రత్న" అవార్డు

దుండ్ర సుమన్ కు “దళిత రత్న” అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన జై భీమ్ సైనిక్ దళ్ మండల అధ్యక్షులు దుండ్ర సుమన్ కు  “దళిత రత్న” అవార్డు పురస్కారం లభించింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన మహనీయుల జయంతి సందర్భంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రముఖులకు “దళిత రత్న” అవార్డులు అందజేసినట్లు బుధవారం సుమన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దుండ్ర సుమన్ మాట్లాడుతూ ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో ముందుండి పనిచేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ అల్లిబిల్లి మహేందర్ కు, సాంఘిక సంక్షేమ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -