Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సమస్యలపై స్పందించిన పాలకవర్గం 

ప్రజల సమస్యలపై స్పందించిన పాలకవర్గం 

- Advertisement -

వెనువెంటనే పరిష్కారానికి మార్గం చూపిన సర్పంచ్ 
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని 7వ వార్డులో గత అనేక సంవత్సరాల కాలం నుండి చేరుకట్ట కానివాసులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ సమీప రహరి, మున్నూరుకాపు పాత సంఘం సమీపంలో గ్రామస్థులు వేస్తున్న చెత్తతో సమీప నివాసల ప్రజలు తమ ఇబ్బందులు పట్టించుకోవాలని బుధవారం వార్డు సభ్యుడు వినయ్ గౌడ్ కు విన్నవించారు. ఈ నేపథ్యంలో కాలానివాసులకు బాసటగా నిలబడి, పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రము అందించారు.

దుర్గంధం సమస్యతో చాల ఇబ్బందులు పడుతున్నాని, వీటిద్వారా తమ ఆరోగ్యాలు చెడిపోయినా పాలకులు పట్టించుకోరా అని తమ ఆవేదన వెళ్ళగక్కాడంతో, స్పందించిన గ్రామ సర్పంచ్ కార్యదర్శి, పాలకవర్గంతో కలిసి పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెంటనే, చెడిపోయిన డ్రైనేజి తోపాటు, చెత్త చెదారం తొలగించే పనులు ప్రారంభించారు. దింతో కాలానివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై గ్రామస్థులు ఎక్కబడితే అక్కడ చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామములో ప్రతి రోజు పంచాయతీ ట్రాక్టర్ లో చెత్త వెయ్యాలని ప్రజలకు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -