– హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్, బంజేరుపల్లి గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ కు రూ .2389, కామన్ వెరైటీకి రూ.2369 , సన్న వడ్లకు అదనంగా క్వింటాల్ కు రూ.500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలుకు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ జంగపల్లి ఐలయ్య , సర్పంచ్ చంద్రకళ, పోతారం ఎస్ ఉప సర్పంచ్ , ఉప సర్పంచ్ ల మండల అధ్యక్షుడు బొమ్మగాని రాజ్ కుమార్, ఏపీఎం బబ్బురు తిరుపతి రైతులు తదితరులు పాల్గొన్నారు.



