నవతెలంగాణ – వనపర్తి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వర చారి, అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏం రాజు, సీపీఐ(ఎం) వనపర్తి 18 వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు డి కురుమయ్య పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాంతం కుల నిర్మూలన కోసం పనిచేశారని 1927 లోనే మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారని అంటరానితనానికి వ్యతిరేకంగా మహద్ చెరువు లోకి దళితులందరినీ సామూహికంగా వేలాది మందిని దింపి వివక్షకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేశారని తెలిపారు. కానీ నేడు కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా మనుధర్మ శాస్త్రాన్ని అమలులోకి తేవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు పన్నుతున్న మనువాదులు అధికారంలో ఉన్నారని అన్నారు. బిజెపి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 400 ఎంపీ స్థానాలు వస్తే నేడు ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి ప్రాచీన భారత రాజ్యాంగమైన మనధర్మ శాస్త్రాన్ని తెస్తామని గంటాపరంగా బహిరంగంగా ప్రచారం చేసిన ఆర్ఎస్ఎస్ సాంగ్ పరివార్ బిజెపి నేడు అధికారంలో ఉందని గుర్తు చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని, మనువాదులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే అంబేద్కర్ కి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. నేటికీ కొనసాగుతున్న అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాలని కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని, ఎస్సీలు క్రైస్తవ మతంలో చేరితే రిజర్వేషన్లు రద్దు చేస్తామని, సుప్రీంకోర్టు తీర్పునివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
రిజర్వేషన్లు వచ్చింది మత ప్రాతిపదికన కాదని, వెనుకపాటు తనానికి దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయంలో అంతర్భాగంగా వచ్చింది రిజర్వేషన్లు అని, కాబట్టి ఏ మతంలో ఉన్న దళితులకూ రిజర్వేషన్లు కొనసాగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని బిజెపి ప్రభుత్వం క్రమంగా ప్రవేటికన్నా చేస్తుందని ప్రైవేట్ రంగంలో వారు జర్వేషన్లు అమలు చేయాలని పోరాడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేయడం దండాలు పెట్టడం మాత్రమే కాదని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మైనార్టీలు రాష్ట్రాలు మైనార్టీలు అనే పుస్తకాన్ని రాశారు. భూమి ప్రభుత్వ పరం కావాలని పరిశ్రమలు జాతీయం కావాలని, అంబేద్కర్ కోరుకున్నారని ఆయన ఆశయ సాధన కోసం అందరూ కట్టుబడి పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు గంధం గట్టయ్య, ఏ రమేష్, బీసన్న, పట్టణ నాయకులు జి భీమయ్య, రత్నయ్య, ఎం మన్యం, బి కురుమయ్య, ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షులు నందిమల్ల రాములు, తదితరులు పాల్గొన్నారు.



