– రాష్ట్ర నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నిర్వహించే ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహ సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య సంఘ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ సంఘం మండల కమిటీ సమావేశం బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ ఈ మహాసభలో తెలంగాణ కొబ్బరి బోర్డు ఏర్పాటు, పామాయిల్ రీఫైనరీ ఏర్పాటు పై తీర్మానాన్ని ప్రవేశ పెట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సంఘ నాయకులు సీసం రాము,కలపాల భద్రయ్య,మడకం శాంతి, మడివి దుర్గారావు,నారం అప్పారావు,నారం సీతమ్మ,సంతపురి చన్నారావు,జల్లి ముత్యాలు పాల్గొన్నారు.



