- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని చింతగూడ గ్రామపంచాయతీలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మండల ప్రభుత్వ వైద్యాధికారి డా.ఉమాశ్రీ పాల్గొని పలువురు వృద్ధులకు బీపీ, షుగర్ టెస్టులు చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కుమార్ ఉపసర్పంచి వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది Mlhp సంధ్యా పల్లవి సూపర్వైజర్ లక్ష్మీ రాజేశ్వరి, ఆశా కార్యకర్తలు మంజుల సరస్వతి కళావతి, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



