Friday, September 4, 2026
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్ పీఎస్ ఎదుట సీజేపీ భారీ ఆందోళన

పార్లమెంట్ పీఎస్ ఎదుట సీజేపీ భారీ ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: గత జూలై 20 నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ సీజీపీ(కాక్రోచ్ జనతా పార్టీ) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. శాంతియుత నిరసనలో పాల్గొన్న పలువురు విద్యార్థులపై ప్రయివేటు వ్యక్తులు దాడులు కూడా చేశారు. ఆ సమయంలో జంతర్ మంతర్ వద్ద ఉన్న నిషూ ఆజాద్ అనే విద్యార్థి తండ్రి సంజయ్ ఆజాద్ పై యూట్యూబర్ స్వతంత్ర భరద్వాజ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. సీజేపీ ఆందోళనల సమయంలో అతనిపై దాడి చేసినట్లు భరద్వాజ్ ఓ చానల్ ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈక్రమంలోనే భరద్వాజ్ ను అరెస్ట్ చేయాలని సీజేపీ ప్రతినిధి అశుతోష్ డిమాండ్ చేశారు. భరద్వాజ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని పార్లమెంట్ పీఎస్ ఎదుట బాధితులతో కలిసి సీజేపీ ఆందోళనకు దిగింది. సీజేపీ భారీ ఆందోళనల నేపథ్యంలో యూపీలో ఉన్న స్వతంత్ర భరద్వాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -