Saturday, September 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివాక్‌‌స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం...

వాక్‌‌స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం…

- Advertisement -

కొంత పూర్వకాలంలోకి వెళ్లి చూసినా భావ ప్రకటనా స్వేచ్ఛ అనేదాన్ని సంరక్షించుకోవలసి వస్తుందనేది ఊహకందని విషయంగానే వుండేది. బ్రిటిష్‌ ‌పాలకుల కర్కోటక శాసనాలకు వ్యతిరేకంగా పోరాడిన భారత స్వాతంత్రోద్యమం వాక్‌‌ స్వాతం త్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలను కాలరాచే దుర్మార్గ ప్రయత్నాలను అనుమతించ లేదు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలో భారత దేశం సంతకాలు చేసింది. అసలు భారత రాజ్యాంగమే దానికి ఉక్కు చట్రంతో రక్షణ కల్పించింది. అయితే ఆ కాలాలు వేరు. విమర్శనాత్మక భావాలు నిరాక్షేపణీయ మైనవిగా వుండేవి. కానీ ఇప్పుడు మనం నివసిస్తున్న యుగం వేరు. ఇది గోడీ మీడియా అంచులలో నడుస్తున్నది. ‘దిమాగీ నక్సల్స్‌’ అనేవారిపై పోరాటం మామూలు విషయంగా మార్చబడింది. గత చాలా కాలంగా హేతుశీలతపై అన్ని వైపులా దాడి సాగుతున్నది. ప్రత్యేకంగా విజ్ఞాన శాస్ర్తం, చరిత్రలపై కోరికోరి దాడులు చేస్తున్నారు. అన్ని రకాలైన చాందసులకూ బాగా చేతనైంది ఇదే. మన విద్యను, విజ్ఞాన వ్యవస్థలను తిరగదోడేందుకు ప్రస్తుత పాలక వ్యవస్థ ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నది. చరిత్ర స్థానంలో పురాణాలే తెచ్చిపెట్టడం జరుగుతున్నది. ఇక తత్వశాస్ర్తం స్థానాన్ని తమ భావజాలంతో నింపేయడం జరుగుతున్నది. వేల ఏళ్ల ముందే గ్రహాంతర యానాలు జరిగేవన్న విడ్డూరపు భావనలు ఏదో వైజ్ఞానిక వాస్తవాల్లా చలామణిలోకి తెస్తున్నారు. అంధకారం, అజ్ఞానం వైపుగా సాగుతున్న ఈ ప్రయాణాన్ని ‘పీపుల్స్‌ ‌డెమోక్రసీ’ ఎప్పటికప్పుడు అందిస్తూనే వుంది.

ఆలోచనలపై ఆంక్షలు
ఆరెస్సెస్‌, ‌దాని హిందూత్వ శక్తులు ఈ ప్రయాణంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతికి సంబంధించిన వివిధ అంశాలను ఛేదిస్తున్న, సమాజంలో మార్పులకు కారణమవుతున్న విజ్ఞానశాస్త్రాన్ని చులకన చేస్తూ తిరస్కరిస్తు న్నాయి. రే బ్రాడ్‌బరీ రాసిన ‘మాస్ర్టో’ అనే నవల ఆధారంగా అదే పేరుతో ఫ్రాన్సిస్‌ ట్రాఫట్‌ 1966‌లో తీసిన సినిమా ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. ‘ఫారిన్‌‌హీట్‌451’ ఒక నవీక దృశ్యకావ్యం. ఇక్కడ కాల్పనికత చాలా వింతగా వుంటుంది. ఒకానొక నిరంకుశ ప్రభుత్వం మొత్తం సాహిత్యమంతటినీ ధ్వంసం చేయడం కోసం ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందితో దళాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎవరినైనా ఏ సమయంలోనైనా దర్యాప్తు చేయడానికి, పుస్తకాలు దగ్ధం చేయడానికి వారికి అధికారమిస్తుంది. తిరుగుబాటు భావాలను రగిలించేవిగా కనిపించే భావాలన్నిటినీ నాశనం చేయాలనేది ఇక్కడ ఆలోచన. పాలకులు ఓ విప్లవం వస్తుందేమోనని హడలిపోతున్నందువల్ల ఇలా జరుగుతుంటుంది. ఇంతవరకూ చూస్తే యుగయు గాలుగా జరుగుతున్నదే. గియార్డినా బ్రూనో, గెలీలియో గెలీలి వంటి వారికి ఏ గతి పట్టించారో మనం విన్నాం. నిరంకుశ సర్కార్లు, అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు నూతన భావాలను ఎదుర్కొనేందుకు భయపడతాయి. తమ తిరుగులేని అధికారం పట్టును అవి ప్రశ్నిస్తాయేమోనని భయపడతాయి.

ఏది సత్యం?
ఏమైనా గెలీలియో లేదా బ్రూనోల భావాలకు ఏం జరిగిందో చరిత్రలో నమోదైంది. సుప్రసిద్ధమైన వైజ్ఞానిక తాత్విక సిద్ధాంతాలకు వారు వైతాళికులుగా గుర్తించబడ్డారు. అయితే ‘ఫారిన్‌ ‌హీట్‌451‌’లో కథనం మనను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 451‌ ఫారిన్‌ ‌హీట్‌ డిగ్రీలకు వేడి పెరిగితే కాగితం దానికదే మండిపోతుంది. దాంట్లో వున్న విజ్ఞానం మటుమాయం అవుతుంది. అయితే తిరుగుబాటు మొదలెట్టిన వారు పుస్తకాలు చట్టవిరుద్ధంగా దాచిపెట్టి వాటిని కంఠోపాఠం చేయడం ద్వారా తమ మెదళ్లలో నిక్షిప్తం చేస్తారు. పెద్ద పెద్ద ప్రసిద్ధ నవలలను చదివి భావి తరాలకు అందిం చేందుకు ఉద్యమం చేపడతారు. ఏమైనా వోల్టైర్ చెప్పిన ఒక మాట ప్రసిద్ధమైపోయింది. ‘నేను నీ భావాలతో అంగీకరించలేకపోవచ్చు. కానీ దాన్ని చెప్పడానికి నీకు గల హక్కును మాత్రం ప్రాణాలొడ్డి కాపాడతాను.’’ ఇప్పటివరకూ నడుస్తున్న చరిత్రలో మానవ హక్కుల పత్రంలో గానీ, భారత రాజ్యాంగంలో గాని కనిపించే స్ఫూర్తి ఇదే.

అయితే ఆరెస్సెస్‌, హిందూత్వ శక్తులు ఈ భావనను అంగీకరించవు. అంతిమ సత్యానికి తామే నిర్ణేతలమన్నట్టు వారు వ్యవహరిస్తారు. కనుకనే మొత్తం చరిత్ర పుస్తకాలను తిరగరాయడం, మన ప్రామాణిక చరిత్రలో కొన్ని కాలాలనే పాఠ్య పుస్తకాల నుంచి మొత్తంగా తొలగించడం చూస్తాం. మతపరమైన గుర్తింపు దర్పణంలో కనిపించని ఇంకా చెప్పాలంటే మెజారిటీ మత విశ్వాసాలను బలపర్చనిదేదీ నడవకూడదు. అందువల్ల భారతీయుల గతంతో పెనవేసుకున్న వైవిధ్యభరితమై విస్తరించి పాతుకు పోయిన విజ్ఞాన భాండాగారాన్ని నిర్దాక్షిణ్యంగా తిరగరాసేయాలి. విధాన నిర్ణయ క్రమంలో పాత్ర వహించే ముఖ్యమైన అధికార పీఠాలన్నీ ఆరెస్సెస్‌ మనుషులకో లేక హిందూత్వ భావజాలాన్ని మోసేవారికో అప్పగించాలి.

పుస్తకాలపై దాడి
ఇటీవలనే ఆగస్టు 27న అహ్మదాబాద్‌ ‌పుస్తక పఠనోత్సవంలో అత్యంత అర్థవంతమైన సంఘటన ఒకటి జరిగింది. ‌బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు మతతత్వ నినాదాలతో ఆ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. పాల్గొంటున్నవారిని బెదిరించే వ్యాఖ్యానాలు చేశారు. ‘అయామ్‌ ‌మలాలా’ (నేను మలాలా), ‘ది డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ ‌గరల్‌’ పుస్తకాలను చదువుతున్నారనేది వారి కోపానికి కారణమైంది. ఒకవైపు నుంచి చూస్తే ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ‘నేను మలాలా’ అనే పుస్తకం రాసిన మలాలా యూసఫ్‌ జా‌య్‌ పాకిస్తాన్‌‌లోని స్వాత్‌ ‌రాష్ర్టానికి చెందిన అమ్మాయి. బాలికలకు చదవును ప్రోత్సహిస్తున్నందుకుగాను ఆమెపై పాకిస్తాన్‌ ‌తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ చర్య ద్వారా తాము కూడా అచ్చంగా పాకిస్తాన్‌ ‌తాలిబన్ల సరసన చేరిపోతున్నామన్నది బజరంగదళ్‌, ‌విహెచ్‌‌పి మూకలు అర్థం చేసుకుంటారని ఆశించడం అమాయకత్వమే అవుతుంది. మలాలా ఆ కాల్పుల గాయాల నుంచి బయటపడి దృఢవిశ్వాసానికి ప్రతీకగా మారింది. ఇంతవరకూ నోబెల్‌ ‌పురస్కారం పొందిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ‘ది డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ ‌గరల్‌’ అనే మరో పుస్తకం మీది దాడి కూడా అప్రధానమైనదేమీ కాదు. ఆమ్‌‌స్టర్‌‌డాంలో ఫాసిస్టు గెస్టపో గూఢచారి సంస్థకు దొరక్కుండా అటకపై దాక్కుని ప్రాణాలతో బయటపడిన అన్నే ఫ్రాంక్‌ అనే అమ్మాయి ఆత్మకథ అది. 1942-44 మధ్య కాలంలో తన ఆటోగ్రాఫ్‌ ‌పుస్తకంలోనే ఆమె ఇవన్నీ రాసిపెట్టింది. సహజంగానే ప్రపంచ సాహిత్యంలో అన్నే ఫ్రాంక్‌ ‌డైరీ అత్యధికంగా అమ్ముడై రికార్డు సృష్టించిన పుస్తకం.

మలాలా యూసఫ్‌ జా‌య్‌, అ‌న్నే ఫ్రాంక్‌ల పుస్తకాలపై దాడి సమకాలీన భారత దేశంలో జరుగుతున్నదేమిటో ప్రతిబింబిస్తుంది. ప్రతిపక్షంలో అత్యంత సీనియర్‌ ‌నేతలలో ఒకరైన సోనియా గాంధీ కూడా ఈ భావాల నియంత్రణకు బాధితురాలైనట్టు వార్తలొచ్చాయి. ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ ‌లవ్‌’ అనే ఆమె ఆత్మకథ ప్రతిని ప్రచురణకు చేపట్టిన పెంగ్విన్ ఇండియా కొన్ని భాగాలు తొలగించాలని చెప్పింది. సంపాదకుల సూచనల పేరిట ఈ విధమైన తొలగింపు తతంగం అధికార వర్గాల ఆదేశాలతోనే జరిగివుంటుందనేది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. సహజంగానే ఆ ప్రచురణను ఇప్పుడు సంస్థ నిలిపేసింది. ఈ విధంగా స్వేచ్ఛాయుత భావాలపైన మాట్లాడటంపైన ఇలా ఒక పద్ధతి ప్రకారం, ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం ఇప్పుడు పరిపా టిగా మార్చబడుతున్నది. మరో సందర్భంలో జాదవ్‌పూర్‌ ‌యూనివర్సీటీలోనూ ఇటీవల అర్థరాత్రి జరిగిన అపఖ్యా తికరమైన దాడి చెప్పుకోదగింది.

ఎబివిపి ఐడెంటిటీ కార్డులు పెట్టుకుని మరీ వచ్చిన ఆ గూండాలు సిసి టివి కెమెరాలలో కూడా చిక్కిపోయారు. దాంతో ‌బెంగాలీలో అత్యధిక సర్క్యులేషన్ గల ‘ఆనంద బజార్‌’ ‌ దినపత్రిక ‘కాషాయ గూండాయిజం’ అని మొదటి పేజీలోనే వార్తా కథనం ప్రకటించింది. ముఖ్యమంత్రి దానిపై మండిపడి ఆ పత్రికపై బెదిరింపులకు దిగి క్షమాపణలు చెప్పాలన్నారు. అదెలాగూ జరగలేదన్నది స్పష్టమే. కొద్ది రోజుల తర్వాత బిజెపి కార్యకర్తలుగా చెప్పబడుతున్న గూండాలు ఆ పత్రిక కార్యాలయం చేరి తెల్లటి గోడలకు కాషాయం రంగు పూశారు. ‘ఆనంద బజార్‌’ ‌చరిత్ర తెలిసినవారెవరికైనా సరే దాని సంపాదక విధానం వామపక్ష దృక్పథానికి సుదూరంగా వుంటుందని బాగా తెలుసు. కానీ ఇవేవీ పట్టని ఆ గూండాలు మాత్రం ఆ టైటిల్‌‌ ‘దిమాగీ నక్సల్స్‌’ పని అని బల్లగుద్ది మరీ అంటున్నారు.

దాడిని ఢీకొనాలి
స్వేచ్ఛాయుత ఆలోచనలు, ప్రసంగాలు, భావ వ్యక్తీకరణలపై పెరుగుతున్న ఈ దాడులు ప్రజాస్వామ్యానికే ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి. ఫాసిస్టు నిర్మాణ వ్యవస్థగల ఆరెస్సెస్‌ నుంచి ఇంతకన్నా మరేమీ ఆశించలేము. ఆ విషయం దాని సైద్ధాంతిక గురువులే దాచిపెట్టలేదు. ఆరెస్సెస్‌కు ‌కీలక పాత్రతో, నయా ఫాసిస్టు లక్షణాలు గల ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఇంతకన్నా తక్కువగా జరిగేది వుండదు. కానీ క్రమక్రమంగా భయం వెనక్కుపోయి సమిష్టి సాహసం ముందుకు రావడం మనం చూస్తున్నాం. కనుక మనకు మనం సన్నద్ధమై ప్రజాస్వామ్యం, వాక్‌ ‌స్వాతంత్రా లను కాపాడుకోవడానికి అత్యంత విశాల ఐక్యతను పెంపొందించవలసిన సమయమిది.
​(సెప్టెంబర్‌ 2 ‘పీపుల్స్‌ ‌డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -