Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేత

విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్ గావ్ ఎంపీపీఎస్ పాఠశాల ఫ్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు రేచల్ రాణి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం హెచ్ఎం రేచల్ రాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రీ ప్రైమరీ స్కూల్ ను ప్రారంభించిందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు చిన్న పిల్లలు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోని ఎన్ కేజీ, యూకేజీ తరహాలో విద్యను అందించినందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించింది అన్నారు.

పాఠశాల మొత్తం సుందరంగా తీర్చిదిద్ది పిల్లలు ఆకర్షితులు కావడానికి ప్రభుత్వం పలు రకాలైన వ్యవస్థను పొందుపరిచిందని అన్నారు. ఇక ఇప్పటి నుండి ప్రతి ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలు శ్రీ ప్రైమరీ స్కూల్ కు తల్లిదండ్రులు పంపాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ పాఠశాల సావర్గావ్ హెచ్ ఎం , గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డు సభ్యులు, తాండవాసులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -