Saturday, September 5, 2026
E-PAPER
Homeఖమ్మంఏరియా ఆస్పత్రిలో ఒకేరోజు నాలుగు సాధారణ ప్రసవాలు

ఏరియా ఆస్పత్రిలో ఒకేరోజు నాలుగు సాధారణ ప్రసవాలు

- Advertisement -

మెరుగైన సేవలందిస్తున్న వైద్యులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రి వైద్యులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఒకే రోజులో ఐదుగురు గర్భిణులకు విజయవంతంగా ప్రసవాలు నిర్వహించారు. ఇందులో నాలుగు సాధారణ, ఒకటి సిజేరియన్‌ ప్రసవం. ప్రసవాల అనంతరం తల్లులు, శిశువులంతా ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధారుక్మిణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్న గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఒకే రోజు ఐదు ప్రసవాలు విజయవంతం కావడం పట్ల వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపడేందుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు అందిస్తున్న సహకారం కీలకమని డాక్టర్‌ రాధారుక్మిణి తెలిపారు. వారి సహకారంతో ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించగలుగుతున్నామని చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు ప్రసవ సేవలు మెరుగ్గా అందుతున్నాయని రోగులు, వారి బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రసవాల నిర్వహణలో ఆర్‌ఎంఓ, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ మౌనిక, మత్తు వైద్య నిపుణులు, హెడ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ వర్ధిని, నర్సింగ్‌ ఆఫీసర్లు ప్రమోలా రాణి, గణేష్‌, ఏఎల్‌ఎం స్వరూపరాణి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రసవాలు పొందిన వారిలో అశ్వారావుపేట ఏఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన తాళ్లూరి మోహన వంశీ, చలమప్పగూడెంకు చెందిన బండారి నాగేశ్వరి, పాత పూచిరాలకు చెందిన పోట్ల నందిని, తొట్టిపంపునకు చెందిన మొడియం నాగమణి, అశ్వారావుపేట మండలం పేట మాలపల్లికి చెందిన నందికోల అభినయ ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -