Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలి

ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలి

- Advertisement -

మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి..
నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల ప్రత్యేక అధికారి నాగు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, సేవలందించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

గ్రామ స్థాయిలో వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన వారికి తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను సమర్పించి, భవిష్యత్ కార్యాచరణపై వివరించారు. స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ రోడ్డు ప్రమాదాల నివారణ, అరైవ్-అలైవ్ కార్యక్రమం, సైబర్ క్రైమ్ మోసాలు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, హౌసింగ్ పీడీ, ఎంపీడీవో శేషు కుమార్, తాసిల్దార్ దయానందం, ఎస్సై క్రాంతి కుమార్, మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య, సిడిపిఓ శ్రీజ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -