Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను శనివారం మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రాములు, మహేష్ లతో నూతనంగా ఎన్నికైన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శ్యాం సుందర్ రెడ్డికి గ్రామం తరఫున సర్పంచ్ బడుగుల నవనీత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి  కారోబార్ మనోహర్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -