Sunday, September 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమరో చారిత్రాత్మక పోరాటానికి కార్మికులు సిద్ధం

మరో చారిత్రాత్మక పోరాటానికి కార్మికులు సిద్ధం

- Advertisement -

​ఢిల్లీలో 48 గంటల పాటు మహాసమీకరణ
డిసెంబర్ 1,2,3 న ఢిల్లీ మార్చ్‌కు లక్షలాది కార్మికులు : 
సీఐటీయూ రాష్ట అధ్యక్షులు చుక్క రాములు
యాదగిరిగుట్టలో 
సీఐటియూ రాష్ట్ర కమిటీ సమావేశాలు

నవతెలంగాణ – యాదగిరిగుట్ట
​కార్మికవర్గం గతంలో సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి, ప్రజా ప్రయోజ నాలను పరిరక్షించడానికి మరో చారిత్రాత్మక పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే చలో పార్లమెంట్‌‌లో లక్షలాదిగా కార్మికులు పాల్గొని తమ శక్తిని చాటాలని, 48 గంటల కార్మికుల మహాసమీకరణను విజయవంతం చేయాలన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చుక్క రాములు సీఐటీయూ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. అమరవీరులకు రాష్ట్ర కమిటీ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. దేశంలోని కార్మికులు ఎన్నో దశాబ్దాలపాటు సాగించిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులు, సంక్షేమ పథకాలను బలహీనపరిచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కంటే కార్పొరేట్ సంస్థలకు మరింత స్వేచ్ఛ కల్పించడమే ప్రభుత్వ విధానాల ప్రధాన లక్ష్యంగా మారిందని విమర్శిం చారు. నాలుగు కార్మిక కోడ్‌ లు దేశంలోని కోట్లాది మంది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనున్నా యన్నారు.

వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తి భద్రత–ఆరోగ్య పరిస్థితులకు సంబం ధించిన అనేక చట్టాలను ఒకే కోడ్‌లలోకి తీసు కొచ్చి కార్మికు లకు ఉన్న రక్షణలను బలహీన పరిచే విధంగా మార్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం, సామాజిక భద్రత, సంఘటితమయ్యే హక్కు, సమ్మె హక్కు వంటి అంశాలపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థికాభి వృద్ధిలో కీలక పాత్ర పోషించా యన్నారు. ఆ సంస్థలను ప్రయివేటీ కరించడం, ఆస్తులను కార్పొ రేట్ సంస్థలకు అప్పగించడం, కాంట్రా క్టీకరణ, అవుట్‌సోర్సిం గ్‌ను పెంచడం వల్ల శాశ్వ త ఉద్యో గాలు తగ్గుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సామా జిక భద్రతలో లోపాలు వంటి సమస్యలు ఉన్నా యన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగ కార్మికులు కీలక పాత్ర పోషిస్తు న్నారన్నారు. ​ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్. వీరయ్య, జె మల్లికార్జున్, భూపాల్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వీరారెడ్డి, రమ, శ్రీకాంత్, జె వెంకటేష్, విఎస్.రావు, వంగూరి రాములు, ఈశ్వర్ రావు, కూరపాటి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు , రాష్ట్ర నాయకులు , యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, నాయకులు దాసరి పాండు,సీస శ్రీను, సుబ్బూరు సత్యనారాయణ, యస్ కె షరీఫ్ పాల్గొన్నారు.

​జీవించడానికి 
సరిపడా జీతాలుండాలి
పాలడుగు భాస్కర్‌

ధరల పెరుగుదలను అరికట్టి, కార్మికులకు జీవించడానికి సరిపడే వేతనాలు కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్‌ ‌చేశారు. దేశాన్ని నిర్మించేది కార్మి కవర్గ మే.. పరిశ్రమలను నడిపేది కార్మికులే.. రవాణాను కొనసాగించేది కార్మికులే.. ప్రజలకు సేవలం దించేది కార్మికులే.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెము కగా నిలిచేది కార్మికవర్గమేనని అటువంటి కార్మికవర్గం హక్కులపై దాడి జరుగు తున్నప్పుడు మౌనంగా ఉండటం సాధ్యం కాదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -