– డికాక్ సెంచరీ వృధా ొ శేయస్, ప్రభ్‌సిమ్రన్ అర్ధశతకాలు
– పంజాబ్ కింగ్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి
ముంబయి: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ ఛేదనలో ముంబయి బౌలర్లను ప్రభ్‌సిమ్రన్ సింగ్(80 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్(66) రాణించి మ్యాచ్‌ను ముగించారు. విజయానికి 12 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ అయ్యర్ ఔటైనా ప్రభ్‌సిమ్రన్ మిగతా పని కానిచ్చాడు. గత సీజన్లో రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈసారి అజేయంగా దూసుకుపోతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ సేన వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(112) సూపర్ సెంచరీతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. పంజాబ్ బ్యాటర్లు కంగారుపడలేదు. ఘజన్ఫర్ విజృంభణకు పవర్ ప్లేలో ప్రియన్ష్ ఆర్య(17), కూపర్ కొన్నొల్లీ(15)లు ఔటైనా.. మిగతా పని కెప్టెన్, ప్రభ్‌సిమ్రన్ కానిచ్చారు. ఘజన్ఫర్కు రెండు, శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కాయి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(112 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిసాడు. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(3/22) ధాటికి ఆదిలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని డికాక్.. నమన్ ధీర్(50)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం ముంబయి 6వికెట్ల నష్టానికి 195పరుగుల భారీస్కోర్ చేసింది. ఆర్ష్‌దీప్‌కు మూడు, శశాంక్ సింగ్‌కు ఒక వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రభ్ సిమ్రన్‌కు దక్కింది. ఈ గెలుపుతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
స్కోర్‌బోర్డు…
ముంబయి ఇండియన్స్: రికెల్టన్ (సి)శశాంక్ సింగ్ (బి)ఆర్ష్‌దీప్ 2, డికాక్ (నాటౌట్) 112, సూర్యకుమార్ (సి)చాహల్ (బి)ఆర్ష్‌దీప్ 0, నమన్ ధీర్ (సి)బార్ట్లెట్ (బి)శశాంక్ సింగ్ 50, హార్దిక్ పాండ్యా (సి)బార్ట్లెట్ (బి)యాన్సెన్ 14, రూథర్డ్‌ఫోర్డ్ (బి)ఆర్ష్‌దీప్ 1, తిలక్ వర్మ (రనౌట్)వ్యాషక్ 8, మయాంక్ రావత్ (నాటౌట్) 0, అదనం 8. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 195పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/12, 3/134, 4/175, 5/182, 6/193
బౌలింగ్: ఆర్ష్‌దీప్ 4-0-22-3, యాన్సెన్ 4-0-30-1, బార్ట్లెట్ 4-0-39-0, విజరుకుమార్ 3-0-36-0, చాహల్ 3-0-45-0, శశాంక్ సింగ్ 2-0-19-1.
పంజాబ్‌కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్యా (సి)దీపక్ చాహర్ (బి)ఘజన్ఫర్ 15, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (నాటౌట్) 80, కూపర్ కనోలే (సి)డికాక్ (బి)ఘజన్ఫర్ 17, శ్రేయస్ అయ్యర్ (సి)నమన్ దీర్ (బి)శార్దూల్ ఠాకూర్ 66, స్టొయినీస్ (నాటౌట్) 10, అదనం 10. (16.3ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 198పరుగులు.
వికెట్ల పతనం: 1/27, 2/45, 3/184
బౌలింగ్: దీపక్ చాహర్ 2.3-0-45-0, బుమ్రా 4-0-41-0, ఘజన్ఫర్ 4-0-31-2, హార్దిక్ పాండ్యా 3-0-39-0, శార్దూల్ ఠాకూర్ 3-0-42-1.
ముంబయికి మళ్లీ నిరాశే…
- Advertisement -
- Advertisement -



