Sunday, September 6, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మసిగుండ్లపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్ల శ్రీనివాసులు చారి (44) మసిగుండ్లపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో ఫాంపౌండ్‌ గుంతలో స్నానం చేసేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందినట్టు చెప్పారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల క్రితమే మృతుడి తమ్ముడు వడ్ల రాజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే శ్రీనివాసులు మృతి చెందడంతో ఆ కుటుంబం తీరని శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకే కుటుంబంలో   కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం స్థానికులను కలచివేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -