Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథ

- Advertisement -

హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా ‘అంతా రాములోరు చూస్కుంటారు’. అనస్వర రాజన్ హీరోయిన్. శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుకను నిర్వహించారు. ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ,’ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన లవ్ స్టోరీతో మా సినిమాను నిర్మిస్తున్నాం’ అని అన్నారు. ‘మా మూవీలో హీరో , హీరోయిన్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వీళ్ల పెయిర్ మనందరినీ మోటివేట్ చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి జంట అనే ఫీల్ కలిగిస్తారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన చిత్రమిది. అంతా రాములోరు చూస్కుంటారు అనే టైటిల్ మేము ఊరికే పెట్టలేదు. దాని వెనక కాన్సెప్ట్ ఉంది’ అని డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ తెలిపారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,’నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను లాంటి ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అంటే నాకు చాలా ఇష్టం.

ఆ తరహాలో ఈ చిత్రాన్ని నిర్మించాను. మనమంతా ఈ సినిమాతో ప్రేమలో పడతాం’ అని చెప్పారు. ‘మా మూవీ టైటిల్ గ్లింప్స్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను. మా మూవీని కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. సినిమాలోని ప్రతి సీన్ మీకు బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలోని శిరీష, మారుతి క్యారెక్టర్స్ ను మీరు ప్రేమిస్తారని ఆశిస్తున్నాం’ అని అనస్వర రాజన్ అన్నారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ,’ఇది లవ్ స్టోరీతో పాటు బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈ మారుతి మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అతని మీద మీకు జాలి కలుగుతుంది, చిరాకేస్తుంది. ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనే ఫీల్ కూడా వస్తుంది. ప్రేక్షకులు ఈ పాత్రను ఓన్ చేసుకుని చూస్తారు అనే నమ్మకం కథ విన్నప్పుడే కలిగింది. ఈ సినిమాలో ఆద్యంతం మీ ఫేస్ మీద ఒక స్మైల్ వచ్చేలా సీన్స్ ఉంటాయి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -