నవతెలంగాణ-ఆలేరు టౌన్
పట్టణంలో వేణు కాంప్లెక్స్ వద్ద తమకు చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు చదువు నేర్పించిన గురువు ఉత్తమ ఉపాధ్యాయులు, రిటైర్డ్, స్కూల్ అసిస్టెంట్, కొంతం యాదగిరిని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఆయనను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కొంతం యాదగిరిని శర్బనాపురం గ్రామ మాజీ సర్పంచ్, బి,ఆర్ ఎస్ పార్టీ నా యకులు, శర్బనాపురం మాజీ సర్పంచ్, చిరిగిరి సాగర్, శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, సుధా గాని,బిక్షపతి, సుధా గాని సత్య రాజయ్య, చిరిగిరి స్వామి, నల్ల రాజయ్య, నీల రామన్న కొంతం,సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
గురువుకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



