- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నవాబు పేట మండలం లోని యన్మంగండ్ల గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి సర్వే ఫేజ్ 2ను ఎంపీడీవో జయరాం నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి ఓటర్ ఎస్ ఐ ఆర్ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో భాగంగా తమ పేర్లను సరిచూసుకోవాలి అని సూచించారు.బీఎల్ఓలకు ఆయా గ్రామాల ప్రజలు ఓటర్లు బీఎల్ఏలు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ఓటర్లు తమ అనుమానాలను ఓటర్ జాబితా పై అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటర్లు జాబితాలో ఉంటాయని బీఎల్ఏ లు సహాకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



