Sunday, April 19, 2026
E-PAPER
Homeసోపతిఎవరు జీసెస్‌? ఎవరు పోప్‌? ఎవరు ట్రంప్‌?

ఎవరు జీసెస్‌? ఎవరు పోప్‌? ఎవరు ట్రంప్‌?

- Advertisement -

కేతిగాడు : సర్వ శక్తి గలదేవా? దయ గల మా తండి ఒక పోప్‌గా ప్రార్థన చేస్తున్న ఈ సమయమున జరగరాని ఘోరములు ఎన్నో జరుగుచున్నవి. నీవు అంతయూ గమనించుచూనే వున్నావు. అయిననూ నివేదించుట నా ధర్మము గనుక పలుమార్లు విన్నవించుచుంటిని ప్రభువా!
ప్రపంచము నేడు ఓ దుర్మార్గుల ముఠా చేత ధ్వంసము చేయబడుచున్నది తండ్రీ. పసి పిల్లలపై, అమాయకులైన ప్రజలపై ఆయుధదాడులు చేస్తూ, వారిని బలికొంటూ తాము చేస్తున్నది న్యాయసమ్మతమేనని వారు సమర్థించుకుంటున్నారు తండ్రీ. ఈ ముఠాకు దేవుడు వున్నాడనే నమ్మకమే లేదని నేను గట్టిగా చెప్పదలచుకున్నాను. యుద్ధం పేరుతో అత్యంత నగంగా హత్యలు గావిస్తూ చివరికి ఆ దేశాల భూములను, ఆస్తులను, వ్యాపారాలను ఆక్రమించుకుంటున్నారు తండ్రీ.
జుట్టుపోలుగాడు : ఆఫ్ట్రాల్‌ లియో పోప్‌. విరు పోప్‌. ఈ ట్రంపే లేకుంటే ఆ పోప్‌ ఎక్కడీ అతడో బలహీనమైన వ్యక్తి, వెరీ వీక్‌ పర్సన్‌.
కేతిగాడు : ప్రపంచానికి శాంతి సందేశం విన్పించే విషయంలో ట్రంప్‌ యంత్రాంగానికి నేను భయపడే ప్రసక్తే లేదు. దైవ సందేశాన్ని ట్రంప్‌ అర్థం చేసుకోవడం లేదు. ట్రంప్‌నో, మరెవర్నో నేను నేరుగా విమర్శించదలచుకోలేదు. ఓ మతాధికారిగా, పోప్‌గా నేడు ట్రంప్‌తో వాదనకు దిగడం నాకిష్టం లేదు. అయినా వాస్తవాలు చెప్పడానికి నేను భయపడను. వెనకాడబోను. ఒక్కటి మాత్రం సత్యం. శాంతి స్థాపకులు మాత్రమే ఆ ప్రభువు ఆశీర్వాదానికి పాత్రులు.
జుట్టుపోలుగాడు : హా.. హా.. హా.. ఆ పోప్‌ లియో ఫోర్టీన్‌ ఏమంత గొప్ప వ్యక్తి? జరుగుతున్న నేరాలపై స్పందించడంలో అతడు ఎప్పుడూ అంతే. వెరీవీక్‌. ఇక అతని ఫారెన్‌ పాలసీ మరీ దారుణం. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలున్నాయన్నా పట్టించుకోడేంటి? వెనిజులాపై అమెరికా దాడి చేయడాన్ని ఆయన ఖండిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడ్నైన నాపైనే డైరెక్టుగా విమర్శలు చేస్తున్నాడు. మితిమీరిన ఉదారవాదం, ఎక్ట్స్రీమ్‌ లిబరిలిజం. అసలు నా అనుమానం ఏమిటంటే… నేరాలను ముద్దాడే ప్రమాదకారిగా అతగాడు కన్పిస్తున్నాడు. కాస్తైనా కామన్‌ సెన్స్‌ వుండాలి కదా. లెఫ్ట్‌కు మరీ సపోర్ట్‌ చేయడం మానుకోవాలి. అసలా పోప్‌ లియో తీరు ఆయనకే కాదు మొత్తం చర్చికే చేటు చేస్తున్నది. ఓమతాధికారి మతాధికారిగా వుండాలి గానీ, రాజకీయ నాయకునిగా ప్రవర్తిస్తే ఎలా? రాజకీయాలు మాని పోప్‌గా రాణించడంపై దృష్టి పెట్టాలి. ఇది నా సూచన. నేనైతే అసలు పోప్‌ అభిమానినే కాదు. లియో పేరు తొలుత పరిశీలనలోఏ లేదు. నున్ను ఎదుర్కోవాలంటే ఓ అమెరికన్‌ పోప్‌గా వుండాలని చర్చి భావించింది. అంటే నావల్లే ఆ పోప్‌ పదవి దక్కిందని అతగాడు గుర్తించడం లేదు.
కేతిగాడు : ప్రభువా! వారేమి చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఈ లోకాన తామే సర్వ శక్తివంతులమని కొందరు భ్రమపడుతున్నారు. ఇరాన్‌పై ఆకస్మిక యుద్ధ దాడులకు ఈ భ్రమలే కారణం తండ్రీ. యుద్ధాలకు దిగేవారి ప్రార్థలను ఆ దేవుడు ఆలకించడని వీరెరుగురు తండ్రీ. వేల సంవత్సరాల ఇరాన్‌ దేశ నాగరికతను ధ్వంసం చేయగలనని ప్రగల్బాలు పల్కడంలోనే వారి మూర్ఖత్వం తాండవిస్తున్నది ప్రభువా. రక్తంతో తడిసిన హస్తాలు ప్రార్థనకు ఎలా పనికొస్తాయి?
జుట్టుపోలుగాడు : ఛ! మాటకు మాట. ఇలా కాదు. అసలు నేనే పోప్‌ను. కాదు కాదు… నేనే దేవుడ్ని. అవును నేనే జీసెస్‌ను. కావాలంటే చూస్కోండి. ఈ బొమ్మను చూడండి.
నా దివ్య శక్తులతో నేనీ రోగికి స్వస్థత చేకూరుస్తున్నా. ఇప్పుడు నా వెనుక వున్నది నా సైన్యం కాదు. దేవదూతలు. యుద్ధ విమానాలు గద్దల్లా ఎగురుతున్నాయి. అమెరికా జాతీయ పతాకం, నా వెనుక ప్రకాశవలయం (వోరా)గా వుంటుంది. రోగి మంచం చుట్టూతా నర్సు, సైనికుడు, మహిళ, సామాన్యుడు కూర్చోండి. దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న నాకు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేయండి. ఊ….
బంగారక్క : అవును. ఈ దెబ్బతో అసలు జీసెస్‌ ఎవరో పోప్‌ ఎవరో, ట్రంప్‌ ఎవరో ప్రపంచానికి తేలిపోతుంది.
ఇద్దరూ : ఎలా..?
బంగారక్క : పిచ్చివాని స్వర్గం అంటే ఇదే కదా…
ఇద్దరూ : ట్రంప్‌ ఉద్దేశ్యం అదేనా..?

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -