Wednesday, September 9, 2026
E-PAPER
Homeక్రైమ్అప్పుల బాధ తాళలేక 
రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక 
రైతు ఆత్మహత్య

- Advertisement -

​నవతెలంగాణ – చండూరు
​అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్‌ ‌పరిధిలోని అంగడిపేట గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అంగడిపేట గ్రామానికి చెందిన రైతు పనస రాములు (55) తనకున్న ఒక ఎకరం 20గుంటల భూమిలో వ్యవసాయం చేసేవాడు. అవసరాల నిమిత్తం రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. అది ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చండూరు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -