నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పోలీసు అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రవీణ్‌కుమార్‌ను పలు వురు పోలీసు అభ్యర్థులు కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రెండేండ్ల వయో పరిమితి పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2024లో జీవో నెంబర్ 31 ద్వారా కానిస్టేబుల్ అభ్యర్థులకు 34, ఎస్సై అభ్యర్థులకు 37 ఏండ్ల వయస్సు గలవారికి అర్హత కల్పించారని వివరించారు. రెండేండ్ల తర్వాత 31 జీవో కాలప రిమితి ముగిసిందన్నారు. ఈ రెండేండ్ల కాలపరిమితిలో ఎలాంటి పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని చెప్పారు. ప్రభుత్వం మాట నమ్మి, జీవో తెచ్చా రన్న ఆశతో 33 ఏండ్లు నిండిన నిరుద్యోగ అభ్యర్థులంతా ఉద్యోగాలకు సిద్దమ వుతున్నారని అన్నారు. ఇపుడు కొత్తగా 87 జీవో తెచ్చి వయోసడలింపు ఇవ్వ కుండానే ఏడు వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని వివరించారు. దీనివల్ల నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు రెండు లక్షల మందికిపైగా నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోయే ప్రమాదముందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వయో సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 ఏండ్లు, ఎస్సై అభ్యర్థు లకు 38 ఏండ్ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
పోలీసు అభ్యర్థులకు వయోసడలింపు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



