ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు తాజాగా ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ శనివారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారతాడు. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం.. అన్నీ కలిసి ‘రేజర్’గా మారుతుంది ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవిబాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. ఎమోషన్ ఇంటెన్సిటీ రెండింటినీ బ్యాలెన్స్‌గా చూపించే పాత్రగా ఆసక్తిని పెంచింది. రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్‌ని కొనసాగిస్తూ ఈసారి అందరికీ మరింత చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం పవర్‌ఫుల్‌గా ఉంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్‌ఎస్ రాజేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సతీష్ పొలుజు యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి సినిమాకు మరింత బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తిని పెంచుతూ ‘రేజర్’ను ఒక హై-వోల్టేజ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతుందని మేకర్స్ తెలిపారు.



