నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఆర్యవైశ్యులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ కోరారు. బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య మహాసభకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారని, ఈనెల 13 న ఉదయం 10:30 కి మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ గుప్తా ఆధ్వర్యంలో భవన సముదాయ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య ఆథితిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభిస్తారని అన్నారు. అందుకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహాసభ అధ్యక్షులు పోల విట్టాలరావు గుప్తా, రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు మోటూరి మురళి, కార్యదర్శి పోల సుధాకర్, రాష్ట్ర సేవాదళ్ అధ్యకులు మహంకాళి విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులు ఛలో హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



