Wednesday, September 9, 2026
E-PAPER
Homeజిల్లాలుతహశీల్దార్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు

తహశీల్దార్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజా కవి కాళోజీ నారాయణరావు వంటి ప్రజా కవుల రచనలు ఎంతో మందిని చైతన్యవంతం చేశాయని బాన్సువాడ ఆర్డిఓ రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం తహశీల్దార్‌ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. మహనీయులు కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలనీ, తెలంగాణకు ఆయన చేసిన రచనలు చరిత్రలో చెరగని ముద్ర వేశాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, ఆర్ఐ మురళీధర్, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -