- Advertisement -
ప్రజల కోసం రాసే
ఏ కవి అయినా
తన కవిత్వాన్ని
పాఠకులు చూడాలని రాస్తాడు
చూసి స్పందించాలని రాస్తాడు
స్పందించి కన్నెర్రజేయాలని రాస్తాడు
చిత్రంగా… అతని కవిత్వాన్ని
చూసేదీ, చూసి స్పందించేదీ
పాఠకులే అయినా
కన్నెర్రజేసేది మాత్రం
పాఠకులు కాదు పాలకులు!
అది కూడా కవి చూపించిన
సమస్య మీద కాదు
కవి మీదే!!
– పతివాడ నాస్తిక్, 9441724167
- Advertisement -


