Monday, April 20, 2026
E-PAPER
Homeదర్వాజయుద్ధం ముగిశాక...

యుద్ధం ముగిశాక…

- Advertisement -

యుద్ధం ప్రకటించాక ఇక
నువ్వు జాతి హీరో అవుతావు
పత్రికల పతాక శీర్షిక వై వెలుగుతావు
ప్రపంచమంతా నీతో జత కట్టినట్లే అనిపిస్తుంది
యుద్ధం వార్తలు వెద జల్లుతుంటే
ఛానళ్ల రేటింగ్‌ పెరిగి పోతుంది
చరిత్ర ముందూ వెనకా తెగ తవ్వుతారు
వారికి ఇరవై నాలుగు గంటలు సరిపోవు
యుద్ధం అదుపు తప్పి పోయాక
సామూహిక ఖాననాల దశ్యాలు అంతటా
తల్లులందరు మట్టి దిబ్బలపై
కన్నటితో తడిపి తనివి తీరా ఏడుస్తారు….
యుద్ధం ముగించ లేక నీలో వణుకు మొదలు అవుతోంది
మిత్రులంతా నీతి వాక్యాలు వల్లేవేస్తారు
నోబెల్‌ శాంతి బహుమతికి
నామినేట్‌ అయ్యేందుకు పోటీలో
యుద్ధం ముగిశాక మాత్రం నువ్వు జీరో అవుతావు
క్షమించ లేని నేరస్తుడవిగా మిగిలిపోతావు
మొదట కొనయాడిన నోళ్లు బోనులో నిలబెడతారు
– దాసరి మోహన్‌, 9985309080

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -