నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొల్లీ (87) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 54 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో 5 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం బయటపెట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సరదాగా నిర్వహించిన సిక్సర్ల పోటీయే ఈ విజయానికి కారణమని తెలిపాడు. “కూపర్, ఆర్యతో నేను మాట్లాడాను. మనలో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారో పోటీ పెట్టుకుందామని చెప్పాను. గెలిచిన వారికి నా బ్యాట్‌ను బహుమతిగా ఇస్తానని అన్నాను. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే, వాళ్లే అద్భుతాలు చేస్తారు. ఇదే మా జట్టు మంత్రం” అని అయ్యర్ వివరించాడు.
పీబీకేఎస్ బ్యాటర్లకు సిక్సర్ల పందెం పెట్టిన శ్రేయస్ అయ్యర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



