- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సర్పంచ్ తోగర్ల భూషణ్, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం ఎంపీడీఓ గంగాధర్, మాక్లూర్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



