Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

- Advertisement -

తూకంలో మిల్లర్ల మోసాన్ని అరికట్టాలి
రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్  కందాల ప్రమీల
నవతెలంగాణ – కట్టంగూర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘం మహిళా రాష్ట్ర కార్యదర్శి కందాల ప్రమీళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలో ఇస్మాయిల్ పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు కొనుగోలు కేంద్రాలలో కూడా అన్యాయాన్ని గురి కావడం ఏంటని ప్రశ్నించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని లారీలు లేవనే సాకుతో రోజుల తరబడి రైతులు కేంద్రాల వద్ద పడిగాపులుకాయాల్సిన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లర్స్ దగ్గరికి చేరుకున్న ధాన్యాన్ని క్వింటా కు రెండు నుండి మూడు కేజీలు తరుగు తీస్తున్నారని అన్నారు. రైతులు ప్రశ్నిస్తే తాలుందని నూకలు అవుతున్నాయని రకరకాల కారణాలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది దళారులు గ్రామాల్లో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మార్కెట్లో రైతుల పేరుతో అమ్ముతున్నారని వీరికి మాత్రం లారీలు గన్ని బ్యాగ్స్, పుష్కలంగా అందుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని రైతన్న ఆదుకోవడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను అన్ని గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగరవేసి ఘనంగా జరపాలని కోరారు.

కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పెంజర్ల కృష్ణ,మండల కమిటీ సభ్యులు జాల ఆంజనేయులు,బొడ్డుపల్లి నర్సింహ్మ, యన్నమల్ల రామలింగయ్య, మాద బాలరాజు, చెరుకు యాదయ్య, చిలుకూరు శంకరయ్య, యనమల్ల  రాములు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -