- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బాలాజీ నాయక్ పాల్గొని మాట్లాడారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమ గురించి వివరించారు. అనంతరం ఆమె చేసిన సేవలు కొనియాడారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఆమె పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరన్న, పిట్టల ఉప్పన్న, తళ్లపల్లి వెంకన్న, భాస్కర్ నాయక్, క్రాంతి రెడ్డి, రావుల సతీష్, మద్ది రాజేష్, జాగిరి యాక సాయిలు, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


