- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
మండలంలోని అల్లీపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాలను సీఈఓ గౌతమ్‌రెడ్డి సోమవారం సందర్శించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ పర్యటన జరిగింది.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాలు,వంట సామాగ్రి నాణ్యత,శౌచాలయాలను పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలంటూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, గ్రామ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి శ్రీహరి,8వ వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్‌కుమార్,కరోబార్ రాజేందర్, ప్రిన్సిపాల్ స్వప్నకుమారి,అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గంగప్రసాద్,డిప్యూటీ వార్డెన్ కిషోర్,హెల్త్ సూపర్వైజర్ నరేష్ చారి పాల్గొన్నారు.
- Advertisement -



