Monday, April 20, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చేరిక

ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చేరిక

- Advertisement -
  • ఆదర్శంగా నిలిచిన వార్డు సభ్యురాలు
  • నవతెలంగాణ – రాయికల్
    బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆలూరు ఎంపీపీఎస్ పాఠశాలలో గ్రామ 6వ వార్డు సభ్యురాలు ద్యావనపెల్లి స్వాతి తన ఇద్దరు కుమార్తెలు సాత్విక, రిత్వికలను ప్రైవేట్ పాఠశాల నుంచి తీసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ,1వ తరగతుల్లో చేర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నల్లాల స్వామి మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయమన్నారు. ఇతర తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సల్ల మహేష్, ప్రధానోపాధ్యాయులు అక్కినపల్లి సతీష్, ఉపాధ్యాయులు సునీత, సాయికృష్ణ, శృతి, రమేష్ రెడ్డి, ఏఏపీసీ చైర్మన్ చిలుక విజయ, విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు చిలుక సంజీవ్, నల్లాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -