- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా, శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయికి చేరింది. గురువారం ఒక్కరోజే రూ. 6.93 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఇది ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక ఒక్కరోజు ఆదాయాలలో ఒకటి కావడం విశేషం.
- Advertisement -



