నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ లో గల కేజీబీవీ గురుకుల పాఠశాల, మండల కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని, బిచ్కుంద మండల కేంద్రంలోని జుక్కల్ మండలానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాల ను కామారెడ్డి జిల్లా జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ సోమవారం ఆకస్మికంగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల వంటగదిని పరిశీలించారు.
బియ్యం పప్పు కూరగాయలను ఒక్కొక్కటిగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు అందిస్తున్నారా లేదా అన్న విషయం తెలుసుకున్నారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అంతకుముందు విచ్కుంద మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పి సీఈవో చందర్ నాయక్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సౌకర్యాలను విద్యార్థులకు అందించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న స్టాకులను క్షేత్రస్థాయిలో పోయింది నాణ్యతను పరిశీలించారు. పలు సూచనలు వార్డెన్లకు చేయడం జరిగింది. ఈ పరిశీలన కార్యక్రమంలో జడ్పీ సీఈఓ తో పాటు జుక్కల్ ఎంపీడీవో మరియు ఆయా గురుకుల పాఠశాలల ప్రత్యేక అధికారులు, ప్రిన్సిపాల్, వార్డేన్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



