నిరంతరం భద్రతా డ్రైవ్‌లు, ఆకస్మిక తనిఖీలు

– దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అనివార్య సంఘటనలను నివారించడానికి భద్రతా డ్రైవ్‌లు, ఆకస్మిక తనిఖీలను నిరంతరం నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. బ్రేక్‌ బైండింగ్‌లు, రైల్వే ఆస్తుల నిర్వహణపై గురువారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. భద్రతా సంబంధిత పనులకు హాజరుకావడంలో జాప్యాన్ని నివారించేందుకు అన్ని విభాగాలను కలుపుకుని చిన్న వైఫల్యాలను కూడా సంయుక్తంగా పరిష్కరించాలని డివిజనల్‌ రైల్వే మేనేజర్లను ఆయన ఆదేశించారు.

Spread the love