మోడీతో ద్వైపాక్షిక భేటీకి అవకాశం
న్యూఢిల్లీ : బ్రిక్స్ సదస్సులో పాల్గనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శనివారం న్యూఢిల్లీ చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 2020లో గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగిన అనంతరం మోడీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో మెరుగవుతున్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శని, ఆది వారాలలో న్యూఢిల్లీలో బ్రిక్స్ నేతల శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకునే జిన్‌పింగ్ అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు మోడీతో ద్వైపాక్షిక సమావేశం జరిపే అవకాశం ఉంది. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో జిన్సింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. కాగా ప్రతిపాదిత ద్వైపాక్షిక సమావేశంపై ఇరు దేశాలు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.ఇటీవల కిర్గిస్థాన్‌లోని బిష్కెక్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు జరిగినప్పుడు ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని వేదికను పంచుకు న్నారు. అయితే అధికారికంగా ఇరువురు నేతల మధ్య చర్చలేవీ జరగలేదు. జిన్‌పింగ్ భారత పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లి చైనా నేతలు, అధికారులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.
రేపు భారత్‌కు జిన్‌పింగ్ రాక
- Advertisement -
- Advertisement -



