పత్రికలో వార్త వచ్చాక రాయిచేడు ఇందిరమ్మ ఇళ్ల వద్దకు హౌసింగ్ ఏఈ
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఫొటో క్యాప్చర్ కోసం ఇబ్బందులు పడుతున్నారంటూ ‘ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తిప్పలు’ శీర్షికతో శుక్రవారం నవతెలంగాణలో కథనం ప్రచురితమైంది. కథనం ప్రచురితమైన అనంతరం హౌసింగ్ ఏఈ గాయత్రి గ్రామానికి వచ్చి లబ్ధిదారున్ని కలిసినట్లు స్థానికులు తెలిపారు. అయితే పత్రికలో వార్త రావడంతో భయపడి రాలేదని, తన బాధ్యతలో భాగంగానే వచ్చానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో లబ్ధిదారున్ని పత్రికలో ఎందుకు ప్రచురించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రజల సమస్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు స్పందించడం సహజమే అయినప్పటికీ, మీడియా కథనాలపై అధికారుల స్పందన చర్చనీయాంశంగా మారింది. సమస్యలు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు సకాలంలో సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
పత్రిక కథనానికి భయపడి రాలేదు.. బాధ్యతతోనే వచ్చా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



