బీరుట్ : దక్షిణ లెబనాన్లో జీసస్ క్రీస్తు విగ్రహాన్ని ఓ ఇజ్రాయిల్ సైనికుడు ధ్వంసం చేస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దేశంలో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఫొటోను నిశితంగా పరిశీలిస్తు న్నామని ఇజ్రాయిల్ రక్షణ దళం (ఐడీఎఫ్) తెలిపింది. అయితే అది దక్షిణ లెబనాన్లో జరుపుతున్న సైనిక చర్యలలో పాల్గొంటున్న ఐడీఎఫ్ సైనికుడిదేనని ధృవీకరించింది. ఈ ఫొటోను ముందుగా పాలస్తీనా రిపోర్టర్ యూనిస్ తిరావీ తన అధికార ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ చిత్రాన్ని క్రైస్తవ నగరమైన దెబెల్లో తీశారు. కాగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు.
జీసస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయిల్ సైనికుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



