Tuesday, April 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్‌ శక్తుల కోసమే పనిచేస్తున్న మోడీ

కార్పొరేట్‌ శక్తుల కోసమే పనిచేస్తున్న మోడీ

- Advertisement -

– సీఎం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత : జూలకంటి
నవతెలంగాణ -మిర్యాలగూడ టౌన్‌

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లులు అంతా నాటకం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీఐటీయూ భవనంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సీఐటీయూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలుకుతూ వారి ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్‌ పాలన జరుగుతున్నదని, కార్మికుల పోరాటాలను పోలీసులతో అణచి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని దీన్ని కార్మికులు వ్యతిరేకించాలని కోరారు. కార్మిక శక్తి సీఎంకు చూపించాలని, ఆయన చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడు మేడే ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఎం వ్యవహారశైలిపై వ్యతిరేకత పెరుగుతున్నదని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక కర్షక పండుగ అయిన మేడేను విజయవంతంగా జరపాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -