Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేవస్థాన భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత

దేవస్థాన భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత

- Advertisement -

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలకపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని దేవస్థాన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూల్చివేశారు. దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్‌ వేముల నరసింహారావు, ఈవో నరసింహులు ఆధ్వర్యంలో నిర్మాణాన్ని తొలగించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్‌ వేముల నరసింహారావు నవతెలంగాణతో మాట్లాడుతూ.. దేవస్థాన భూముల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని తెలిపారు. దేవస్థానానికి చెందిన భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించేందుకు అవసరమైన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయ అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు స్వరూపరెడ్డి, బుధుగం శ్రీనివాస్‌గౌడ్‌, అరుణ్‌కుమార్‌రెడ్డి, దేవస్థానం క్లర్క్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -