నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని నలంద పాఠశాలలో 70వ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలలో శుక్రవారం ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, ఆయనకు పాఠశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికి జ్ఞాపికను బహుకరించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గత 20 – 30 సంవత్సరాలుగా హాకీ, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు పట్టణ ప్రాంతానికి తలమానికంగా నిలిచాయని వివరించారు.
క్రీడాకారులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ఇప్పటినుండే వారు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చారు. క్రీడల వల్ల క్రీడాకారులకు క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతుందన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలలో క్రీడాకారులు చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. యువతకు భవిష్యత్తులో మంచి దారిలో వెళ్లేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నారా గౌడ్, బ్యాంకు నవీన్, వినోద్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.


