- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ నూతన మున్సిపల్ భవనానికి రూ.7.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. నూతన మున్సిపాలిటీ భవనానికి పలుమార్లు విన్నవించడం జరిగిందని, ఇటీవల మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేయగా, సీఎం హామీ ఇచ్చిన మూడు రోజుల్లో మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నూతన మున్సిపాలిటీ భవనానికి మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు.
- Advertisement -



