Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకం

విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకం

- Advertisement -

మున్సిపల్ చైర్ పర్సన్ గోని లహరి రఘు
నవతెలంగాణ – ఆర్మూర్  
విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకమైందని మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు అన్నారు. పట్టణంలో ఫిజిక్స్ వాలా విద్యాపిత్ పాఠశాల సమీకృత ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగాహాజరై  జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఫ్రెషర్స్ పార్టీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు అలవాటు పడకుండా శ్రద్ధగా చదువుకొని తమ జీవిత లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు కష్టపడి చదివితేనే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతామని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విజయ్ అగర్వాల్, కళాశాల యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -