Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జెంటిల్ కిడ్స్ లో ముందస్తు వినాయక చవితి వేడుకలు

జెంటిల్ కిడ్స్ లో ముందస్తు వినాయక చవితి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -ఆర్మూర్ 
పట్టణంలో జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ లో శుక్రవారం ముందస్తు వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గుజరాతి ప్రకాష్ , ప్రిన్సిపల్ లతా పాల్గొని పార్వతి పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారని చెప్పారు. భాద్రపద మాసం శుక్లపక్షం చవితినాడు ఈ పండుగను నిర్వహిస్తారని వివరిస్తూ మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే పూజించాలని తెలిపారు. దాని వలన పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడవచ్చని చెబుతూ పిల్లలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి ఎంతో ఆనందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -