Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘనంగా ‘ఇరుముడి’ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌

ఘనంగా ‘ఇరుముడి’ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌

- Advertisement -

హీరో రవితేజ నటించిన‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తుండటం విశేషం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. హీరో రవితేజ మాట్లాడుతూ,‘మా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఈ సినిమా నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎంతో రెస్పెక్ట్ తెచ్చి పెట్టింది. ఆ క్రిడిట్ మొత్తం శివ నిర్వాణకే. నటుడిగా నేను ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇరుముడి అంటే శివ, శివ అంటే శివ నిర్వాణ. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. గత 20 రోజులుగా ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్ చేసి ప్రశంసించారు. రవితేజతో ఇలాంటి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కోన వెంకట్, బీవీఎస్ రవికి స్పెషల్ థాంక్స్. నేను నమ్మేది ఒక్కటే, ఒక పనిని నిజాయితీగా చేస్తే సక్సెస్ అదే వస్తుంది’ అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -