నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దఫా చర్చల్లో భాగంగా యూఎస్ ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ బృందం, ఇరాన్ ప్రతినిధుల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. గంటలకు పైగా సాగిన చర్చల్లో అంతిమ ఫలితం తెలలేదు. ఇరువురి డిమాండ్లలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శాంతి చర్చలు విఫలమైయ్యాయి. చర్చల విఫలానికి కారణం మిరంటే మీరు అని రెండు దేశాలు దుమ్మెత్తి పొసుకున్నాయి. తాజాగా ఇరాన్-యూఎస్‌ల మధ్య రెండు విడత చర్చలపై సందిగ్ధత నెలకొంది. చర్చల కోసం తమ ప్రతినిధులెవ్వరు ఇస్లామాబాద్‌కు వెళ్లలేదని ఇరాన్ పేర్కొంది. ఈ అంశంపై ఎలాంటి వార్తలు వచ్చినా అవి అవాస్తమని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. “ఇప్పటివరకు ఏ ఇరాన్ దౌత్య ప్రతినిధి బృందం—అది ప్రాథమిక బృందమైనా, ద్వితీయ బృందమైనా, లేదా తొలి మిషన్ అయినా, తదుపరి మిషన్ అయినా—పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్లలేదు. ఎక్స్ వేదికగా పేర్కొంది
గత వారం పాక్ వేదికగా జరిగిన మొదటి విడత శాంతి చర్చలు విఫలమైయ్యాయి.యుద్ధ నష్టానికి పరిహారంగా హర్మూజ్ గుండా నౌకల రాకపోకలపై టోల్ ఫీజు వసూలు చేస్తామని ఇరాన్ పట్టుబట్టింది. ఆ డబ్బుతో ఇరాన్ పునర్ నిర్మాణానికి వినియోగిస్తామని ఇరాన్ పేర్కొంది. అంతేకాకుండా లెబనాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందంలోకి వస్తోందని, భవిష్యత్‌లో ఇజ్రాయిల్-అమెరికా పశ్చిమాసియాపై దండెత్త కుండా తగిన హామీ ఇవ్వాలని పేర్కొంది. కానీ అందుకు ట్రంప్ ససేమీరా అంటూ..ఇరాన్ సహజ వనరులపై కన్నెశాడు. ఆ దేశంలో నిల్వ ఉన్నా యురేనియం సంపదను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని మొండిపట్టారు. ఓవైపు చర్చలంటూనే ఇరాన్ ఓడరేవులపై దాడులకు తెగబడింది అమెరికా. యూఎస్-ఇజ్రాయిల్ కవ్వింపు చర్యలను ఖండిస్తూ ఇరాన్ చర్చలకు దూరంగా ఉంటుంది.



