Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షయ తృతీయ సందర్భంగా పేదలకు అన్నదానం 

అక్షయ తృతీయ సందర్భంగా పేదలకు అన్నదానం 

- Advertisement -

–  సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ, పండ్ల పంపిణీ
నవతెలంగాణ – కామారెడ్డి

ప్రపంచ మానవ, వినియోగదారుల, బాలల హక్కులు, సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ గ్లోబల్ ఫౌండర్ నేరేళ్ల మల్యాద్రి సూచనల మేరకు..స్టేట్ ప్రెసిడెంట్ వీరమల్ల రమశ్రీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో సోమవారం సాయంత్రం పేదలకు అన్నదానం చేయడంతో పాటు మజ్జిగ, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమశ్రీ మాట్లాడుతూ.. అక్షయ తృతీయ వంటి పుణ్యదినంలో కొద్దిమంది పేదలకు అయినా ఆహారం అందించడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -