నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని శ్రీ రాజరాజేశ్వరి నగర్ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలలో మంగళవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డిని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, ఉప్లూర్ సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, స్థానిక ఉపసర్పంచ్ ప్రసాద్, నాయకులు బుచ్చి మల్లయ్య, ప్రవీణ్, ధ్యాగ నర్సారెడ్డి, తిప్పి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొమ్ముల రవీందర్, బద్దం తిరుపతి, బోనగిరి భాస్కర్, సాదుల్లా, నరేష్, శ్రీనివాస్, విజయ్, అంజనేయులు, సల్మాన్, ఉబేద్, మునీర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలలో మానాల మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



