Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

– రూ. 2400 మద్దతు ధర పూర్తిగా రైతులకు అందేలా చర్యలు
– దేవదారికుంట తండా కొనుగోలు కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – ఉప్పునుంతల

మండల పరిధిలోని దేవదారికుంట తండాలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎటువంటి ఆలస్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.2400 మద్దతు ధర రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మొక్కజొన్న పంట తేమ శాతం 14% లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తేమ అధికంగా ఉంటే ధర తగ్గే అవకాశం ఉన్నందున నాణ్యతపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. కేంద్రంలో తూకం, నిల్వ, రవాణా సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని, రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, పీఏసీఎస్ సీఈఓ కొమ్ము ఎల్లయ్య, ఆర్ఐ బలరాం, శివ, పీఏసీఎస్ మల్లేష్, రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -