Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో ముగిసిన ఎన్నిక‌ల‌ ప్ర‌చారం

తమిళనాడులో ముగిసిన ఎన్నిక‌ల‌ ప్ర‌చారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏప్రిల్ 23న (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రచారానికి ఆఖరి రోజున ప్రధాన పార్టీలన్నీ రోడ్‌ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించాయి. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు, సవాళ్లతో తమిళనాడులో రాజకీయ వాతావరణం హీట్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోనూ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -